అసెస్మెంట్ బుక్ లెట్‌లను పాఠశాలకు అందజేత

NLR: ఉదయగిరి మండలంలోని 62 ప్రభుత్వ పాఠశాలలకు అసెస్మెంట్ బుక్ లెట్లను అందజేసినట్లు ఎంఈఓ తోట శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుక్ లెట్‌లను ఎలా వినియోగించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బయట పరీక్షా పత్రాలు కొనుగోలు చేయకుండా ఉపయోగించుకొని భవిష్యత్తులో విద్యార్థి పురోగతి అంచనా వేసుకునేందుకు దోహదపడుతుందన్నారు.