రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ELR: దెందులూరు రైల్వే గేటు సమీపంలో మంగళవారం రైలు నుంచి జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు, ఎత్తు 5.6 అడుగులు ఉంటుందని తెలిపారు. మృతదేహంపై బ్లూ కలర్ జీన్స్, ఎరుపు నలుపు గీతల ఫుల్ హ్యాండ్స్ చొక్కా ఉన్నాయన్నారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.