యుద్ధం ఎఫెక్ట్.. చార్టర్డ్ విమానాలకు ఫుల్ గిరాకీ
ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ప్రైవేట్ జెట్లను బుక్ చేసుకుంటున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం వీటికి డిమాండ్ 50% పెరిగిందని క్లౌడ్ రన్నర్ ఏవియేషన్ సీఈవో తెలిపారు. దుబాయ్ నుంచి భారత్‌కు మధ్య స్థాయి ప్రైవేట్ జెట్ ధర 70వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెరిగిందని వెల్లడించారు.