'శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి'
ASF: కాగజ్ నగర్ పట్టణంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు శనివారం కవాతు నిర్వహించారు. SP నితికా పంత్ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. DSP వహిఉద్దీన్, CI ప్రేమకుమార్, కుమారస్వామి, ఎస్ఐలు పాల్గొన్నారు.