'రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి'

'రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి'

ADB: తాంసి మండలంలో తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీపీఆర్వో ఆదేశాల మేరకు రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలన, అంటురోగాలపై కళాజాతా ప్రదర్శన చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పాటల ద్వారా చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.