వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర షెడ్యూల్ ఖరారు

వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర షెడ్యూల్ ఖరారు

WGL: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 26న వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర, శ్రమదాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ కార్యకర్తలు,నాయకులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.