'ధురంధర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

'ధురంధర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సినిమా 'ధురంధర్'. నిన్న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా కేవలం ఇండియాలోనే మొదటి రోజు రూ.28.6 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.