VIDEO: విద్యార్థి అనుమానస్పద మృతిపై విచారణ
ప్రకాశం: సింగరాయకొండలోని నవోదయ పాఠశాలలో ఫిబ్రవరి 14న అనుమానస్పద మృతి చెందిన 6వ తరగతి విద్యార్థి తౌషిక్ మృతిపై అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య స్థానిక సీఐ ఎస్సైలతో కలిసి విచారణ చేపట్టారు. నివేదిక తయారు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.