భక్తుల మృతి బాధాకరం: మంత్రి

సత్యసాయి: సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియశారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.