లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు శిక్ష

లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు శిక్ష

NLR: జిల్లాలో బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో జరిగిన ఈ ఘటనపై 2021లో కేసు నమోదు చేశారు. బాధితురాలిని బెదిరిస్తూ పలుమార్లు దాడి చేసినట్లు విచారణలో తేలగా, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికల ఆధారంగా నేరం రుజువైంది. దీంతో కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. కాగా, బాధితురాలికి పరిహారం చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది.