అలర్ట్.. నేడు స్కూళ్లకు వెళ్లాల్సిందే.!

అలర్ట్.. నేడు స్కూళ్లకు వెళ్లాల్సిందే.!

SKLM: 'మొంథా' తుఫాన్ ప్రభావంతో గత నెల 29న జిల్లాలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, విద్యా సంవత్సరంలో పనిదినాలను భర్తీ చేసేందుకు, ఇవాళ రెండో శనివారం సెలవు ఉన్నప్పటికీ అన్ని పాఠశాలలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి, పిల్లలను పాఠశాలలకు పంపాలని అధికారులు కోరారు.