భూపాలపల్లిలో ఎస్సైల బదిలీలు

BHPL: జిల్లాలో ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలిమెల ఎస్సై తమాషా రెడ్డి కాళేశ్వరం పీఎస్‌కు, సీసీఎస్ భూపాలపల్లి ఎస్సై రమేష్ పలిమెల పీఎస్‌కు, భూపాలపల్లి ఎస్సై సుధాకర్ టేకుమట్ల పీఎస్‌కు, భూపాలపల్లి సీసీఎస్ ఎస్సై సాంబమూర్తి భూపాలపల్లి పీఎస్‌కు బదిలీ అయ్యారు. సక్రమంగా విధుల నిర్వహణ చేయాలని ఎస్పీ సూచించారు.