పామూరులో ఘనంగా ఫూలే వర్ధంతి కార్యక్రమం
ప్రకాశం: మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని పామూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కే.వెంకట రమణయ్య మాట్లాడుతూ.. ఒక రచయితగా, సామాజిక తత్వవేత్తగా, సంఘసంస్కర్తగా సమాజానికి ఫూలే చేసిన సేవలు మరువలేనివని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఇమ్మడిశెట్టి శ్రీను, చిన్న సుబ్బయ్య పాల్గొన్నారు.