భార్యను హతమార్చిన భర్తకు జీవిత ఖైదు

భార్యను హతమార్చిన భర్తకు జీవిత ఖైదు

జగిత్యాల జిల్లాలో అదనపు కట్నం కోసం భార్య నిషితను హత్య చేసిన కిషోర్‌కు జిల్లా జడ్జి నారాయణ జీవితఖైదు, రూ. 10 వేల జరిమానా విధించారు. 2021లో వివాహం తర్వాత కట్న వేధింపులు కొనసాగగా, పంచాయతీలు కూడా ఫలితం ఇవ్వలేదు. చివరకు నిషితతో ఆత్మహత్య నోటు రాయించి, గొంతు నొక్కి హత్య చేసి ఆత్మహత్యగా చూపేందుకు ప్రయత్నించాడు. విచారణ అనంతరం కోర్టు దోషాన్ని నిర్ధారించి కఠిన శిక్ష విధించింది.