విమానాశ్రయంలో మొక్కలు నాటిన SPF బృందాలు
HYD: 99 డేస్ ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 2026 కార్యక్రమంలో TGSPF పోలీస్ బృందల ఆధ్వర్యంలో వివిధ యూనిట్లలో నేడు పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ యూనిట్, బెల్ ప్రాంగణంలో హరితహారం కింద మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబాటును తెలియజేస్తూ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. స్పెషల్ డ్రిల్ డ్రైవ్ నిర్వహించారు.