జాతీయ టీటీ పోటీలకు రాజమండ్రి వైష్ణవి ఎంపిక

జాతీయ టీటీ పోటీలకు రాజమండ్రి వైష్ణవి ఎంపిక

E.G: ఇండోర్‌లో మార్చి 14 నుంచి 21 వరకు జరగనున్న 87వ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలకు రాజమండ్రి క్రీడాకారిణి వై.వైష్ణవి సూర్య ఎంపికయ్యారు. ర్యాంకింగ్ పోటీల పాయింట్ల ఆధారంగా రాష్ట్ర సీనియర్ మహిళల జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. దీంతో జిల్లా టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు జెవీవీ అప్పారెడ్డి, కోశాధికారి కె.సత్యనారాయణ, కోచ్ సుబ్బారావు ఆమెను అభినందించారు.