స్థిరంగా కొనసాగుతున్న కొబ్బరి ధరలు
కోనసీమలో కొబ్బరి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్త కొబ్బరి కురిడి వెయ్యి కాయలకు రూ 17,000 వరకూ ధర పలుకుతుంది. పాతకాయ గండేరా రూ 27,000, గటగట రూ 25,000గా వుంది. కొత్త పచ్చి కాయ రూ. 13,000 నుంచి రూ .14,000 వరకూ కొంటున్నారు. కొబ్బరి నూనె కేజీ రూ 400 గా వుంది. రాబోయే రోజుల్లోనైనా ధర మరింత పెరుగుతుందని రైతులు ఆదివారం ఆశాభావం వ్యక్తం చేశారు.