కరాటే శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
NLG: జిల్లాలోని PM శ్రీ పథకం కింద 36 ప్రభుత్వ స్కూల్స్ నందు బాలికలకు స్వీయ రక్షణకు సంబంధించి 3 నెలల శిక్షణ ఇచ్చేందుకు కరాటే శిక్షకులు కావాలని జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ ఆలీ తెలిపారు. ఇందుకుగాను బ్లాక్ బెల్ట్ కలిగిన వారు అర్హులు. వారికి నెలకు రూ.10 వేల చొప్పున పారితోషకం ఇస్తామన్నారు. మొదటిగా మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.