గొలుగొండ మండలంలో హోమం పూజలు

AKP: జిల్లా గొలుగొండ గ్రామ ప్రజలు శనివారం హోమ పూజలు నిర్వహించారు. గ్రామం గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురవడంతో గ్రామ ప్రజలంతా ఏదో అరిష్టం పట్టిపీడిస్తుందని గ్రామ పెద్దలతో కలిసి గ్రామంలో హోమ పూజలు చేస్తున్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవించాలని గ్రామం చుట్టూ కనికట్టుకట్టి క్షుద్ర శక్తులను గ్రామం నుంచి పారతోలారు.