వెంకటరెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

వెంకటరెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గురువారం కనిగిరిలోని కొత్తూరులో వెంకటరెడ్డి నివాస గృహానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.