రాడ్‌తో తలపగల గొట్టాడు..అరెస్టయ్యాడు: CI

రాడ్‌తో తలపగల గొట్టాడు..అరెస్టయ్యాడు: CI

ADB: హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. స్థానిక ఖిల్లా కాలనీకి చెందిన అస్లాం అతని చిన్నాన్న కుమారుడు ఇమ్రాన్‌పై బుధవారం రాడ్‌తో దాడి చేశాడన్నారు. దీంతో అతని తల పగిలి గాయాలపాలయ్యాడని పేర్కొన్నారు. వారి మధ్య ఆస్తి తగాదాల కారణంగా ఈ దాడి జరిగినట్లు వివరించారు.