రామయ్య భక్తుల పాదయాత్ర

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని సిద్దవటం మండలం ఉప్పరపల్లి గ్రామ పంచాయితీ సాయినగర్‌కు చెందిన భక్తులు కోదండ రామాలయం నుంచి ఒంటిమిట్ట కోదండరామాయలం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఒంటిమిట్ట రాముని రంగ మండపంలో ఉన్న శ్రీ గరుడాల్వారు గుడి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.