గ్యాస్ కోసం పడిగాపులు
RR: కొందుర్గు మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి గ్యాస్ ఏజెన్సీల వద్దకు చేరుకుని క్యూ లైన్‌లో నిలబడుతున్నామని, గంటల తరబడి వేచి చూసినప్పటికీ సిలిండర్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు వదిలి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.