ఆర్టీసీ కార్మికుల సమ్మె.. రెండు కేసులు నమోదు

ఆర్టీసీ కార్మికుల సమ్మె.. రెండు కేసులు నమోదు

NGKL: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మొదటిరోజు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో కల్వకుర్తి, కొల్లాపూర్‌లలో రెండు కేసులు నమోదు అయినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. సమ్మె సందర్భంగా విధుల్లో చేరే డ్రైవర్లు, కండక్టర్ల విధులకు ఎవరైనా ఆటంకం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించరాదని సూచించారు.