VIDEO: నాగార్జున సాగర్.. జిల్లా మణిహారం..!
PLD: ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడంగా పేరుగాంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, తెలుగు రాష్ట్రాల పాలిట వరప్రదాయిని. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తోంది. జలాశయం నడిబొడ్డున ఉన్న నాగార్జున కొండ మ్యూజియం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. బోటింగ్, అందమైన జలదృశ్యాలకు ఇది కేరాఫ్ అడ్రస్. అటు వ్యవసాయానికి, ఇటు పర్యాటకానికి ఈ ప్రాజెక్ట్ తలమానికంగా నిలుస్తోంది.