రేపటి నుంచి విద్యార్థులకు మేధా యోగ శిక్షణ

KDP: శ్రీ అవధూత కాశి నాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, నరసాపురంలోనే ఏపీ మోడల్ స్కూల్లో మేధా యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో 13-18 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నారాయణరెడ్డి తెలియజేశారు.