18న జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు

SRD: పటాన్ చెరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జిల్లా స్థాయి చెస్ అండర్-14, 17 ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. అండర్-14కు 1-1-2012 తరువాత, అండర్-17కు 1-1-2009 తర్వాత జన్మించిన వారు అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 98495 31989, 95057 96688 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.