విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే
NRML:లక్ష్మణచందాలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని బీజేఎల్పీ నేత, MLA మహేశ్వర్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఆయన వంటకాల రుచి, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, మెను ప్రకారం భోజనం అందించాలని నిర్వహకులకు సూచించారు. అనంతరం రూ. 10 లక్షలతో KGBV స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు.