లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 2,921 కేసుల పరిష్కారం

లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 2,921 కేసుల పరిష్కారం

NLG: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టు ప్రాంగణాలలో ఏకకాలంలో చేపట్టారు. ప్రజల సౌకర్యార్థం మొత్తం 12 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి 2,921 కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు.