బీజేపీలోకి మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు
కరీంనగర్ నగర పాలక సంస్థలో కమల వికాసం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేశ్ బీజేపీలో చేరారు. తాజా చేరికలతో ఎంపీ ఓటు సహా పార్టీ బలం 35కు చేరింది. మరో ఆరుగురితో చర్చలు జరుపుతుండటంతో మేయర్ పీఠం దక్కించుకోవడంపై ఆ పార్టీ ధీమాగా ఉంది.