'పాల ఉత్పత్తిపై చలిపంజా ప్రభావం'

'పాల ఉత్పత్తిపై చలిపంజా ప్రభావం'

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల చలి తీవ్రత పెరగడంతో పాడి పరిశ్రమపై ప్రభావం స్పష్టంగా చూపుతోంది. డిసెంబర్ నెల నుంచి చలి కారణంగా పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. జిల్లాలో 15 లక్షల పశువులు ఉండగా, 5 లక్షల పశువుల నుంచి రోజుకు సుమారు 25 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతోంది. అయితే, చలి ప్రభావంతో దిగుబడి తగ్గి రైతులు ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు.