కానిస్టేబుల్ కుటుంబానికి బీమా చెక్కు అందజేత
KMR: గాంధారికి చెందిన కానిస్టేబుల్ వడ్ల రవి విధి నిర్వహణలో భాగంగా గతేడాది కారు ఢీకొనడంతో మృతి చెందాడు. అతని మరణానంతరం ఆయన సతీమణికి కారుణ్య నియామకాల కింద ఎస్పీ రాజేష్ చంద్ర ఉద్యోగం కల్పించారు. అయితే, కానిస్టేబుల్ రవికి ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉండటంతో సంబంధిత బ్యాంక్ అధికారులు అతనికి మంజూరైన రూ. కోటి బీమా చెక్కును SP సోమవారం అందచేశారు.