రేపు ఆత్మకూరు మండల సర్వసభ్య సమావేశం
NDL: ఆత్మకూరు మండల సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 22వ తేదీ (బుధవారం) ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నాగేంద్రుడు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలతో సిద్ధంగా రావాలని, మండల అభివృద్ధిపై చర్చించే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు.