టెన్నిస్ దిగ్గజానికి X కేటగిరీ భద్రత
టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు X కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇక నుంచి ఆయనకు CISF సిబ్బంది భద్రత కల్పించనున్నారు. బీజేపీలో చేరిన వారం రోజుల్లోనే కేంద్రం ఆయనకు ఈ భద్రత కల్పించడం విశేషం.