విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

VZM: శ్రీకాకుళం జిల్లా బైరి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగలను కఠినంగా శిక్షించాలని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నెల్లిమర్లలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు ఎక్కువయ్యాయని చెప్పారు.