VIDEO: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో సింహవాహన సేవ
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం సింహ వాహన సేవ నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, రుద్రపఠనాలు, జాగరణ కార్యక్రమాలు రాత్రి పొడవునా కొనసాగనున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి శివనామస్మరణలో పాల్గొననున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుధాకర్ తెలిపారు.