బెయిర్‌స్టోకు షాక్.. స్టోక్స్‌కు రెండేళ్ల పొడిగింపు

బెయిర్‌స్టోకు షాక్.. స్టోక్స్‌కు రెండేళ్ల పొడిగింపు

ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టోకు చోటు దక్కలేదు. అలాగే ఇటీవల రిటైర్ అయిన క్రిస్ వోక్స్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. అయితే, బెన్ స్టోక్స్‌కు మరో రెండేళ్ల కాంట్రాక్ట్‌ను పొడిగించింది. దీంతో 2027లో సొంత గడ్డపై జరిగే యాషెస్ సిరీస్‌లో కూడా స్టోక్స్ ఆడటం దాదాపుగా ఖాయమైంది.