వి-పుల్ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనిటీ అభివృద్ధి

వి-పుల్ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనిటీ అభివృద్ధి

VSP: నగరంలో వి-పుల్ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో విశాఖ ఎంపిక కావడం గర్వకారణమన్నారు. శివగణేష్ నగర్, వాసవానిపాలెం ప్రాంతాలను పరిశీలించిన ఆయన, మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు గ్రీన్ బెల్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.