17 ఇరాన్ నౌకలను ధ్వంసం చేశాం: అమెరికా
ఇరాన్‌కు చెందిన జలాంతర్గామి, 17 నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఈ దాడుల కోసం బి-1, బి-2 బాంబర్లను వాడినట్లు తెలిపారు. మరోవైపు ఖతార్‌లో ఇరాన్ గూఢచర్యం చేస్తున్న 10 మందిని అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు చెప్పారు. వీరందరూ ఖతార్ సైనిక స్థావరాలపై నిఘా వేసినట్లు పేర్కొన్నారు.