నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: కూసుమంచి మండలం జీళ్లచెరువు 11KV సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు ఏఈ అశోక్ తెలిపారు. జీళ్లచెరువు రూరల్ ఫీడర్ పరిధిలో చెట్ల కొట్టివేత, మరమ్మతు పనుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జీళ్లచెరువు, గోపాలరావుపేట, మునిగేపల్లి గ్రామాల్లో విద్యుత్ నిలిపివేయబడుతుంది.