VIDEO: అనూరియా బాధితులకు ఎంపీ, ఎమ్మెల్యే పరామర్శ
E.G: రాజమండ్రిలో నమోదైన అనూరియా కేసుల నేపథ్యంలో కిమ్స్, రెయిన్‌బో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి మంగళవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు.