VIDEO: రాచూరులో ఘనంగా పోచమ్మ బోనాలు

VIDEO: రాచూరులో ఘనంగా పోచమ్మ బోనాలు

NGKL: వెల్దండ మండలం రాచూరు గ్రామంలో శనివారం పోచమ్మ బోనాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు బోనం తయారుచేసి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి, పాడి పంటలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ వేడుకలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.