రేణిగుంటకు అలెర్ట్.. ఎమ్మార్వో సూచనలు
TPT: రాబోయే మూడు రోజుల్లో రేణిగుంట మండలంలో భారీ గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, పాత ఇళ్లలో ఉన్న వారు సమీప శరణాలయాలకు వెళ్లాలని కోరారు. అత్యవసర పరిస్థితిలో కంట్రోల్ రూమ్ నంబర్ 90100464562 సంప్రదించాలని తెలిపారు.