ప్రకృతి వ్యవసాయంపై మహిళా రైతులకు అవగాహన
KNR: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లిలో డెమో ఫార్మర్ ఇంగ్లీ పద్మ వ్యవసాయ క్షేత్రంలో మహిళా రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. BRC ఇంఛార్జ్ మురళీధర్ రైతులకు భూమి సుపోషణ, సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. భూమిలో జీవవైవిధ్యం పెరగడానికి నవధాన్యాలు చల్లుకోవాలని సూచించారు.