రేపు మెగా జాబ్ మేళా
KMM: సత్తుపల్లి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో సింగరేణి కాలరీస్ లిమిటెడ్, తెలంగాణ అకాడమీ స్కిల్ నాలెడ్జ్ సహకారంతో ఈ నెల 26న తల పెట్టిన మెగా జాబ్ మేళాను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. స్థానిక రాణి సెలబ్రేషన్స్ కల్యాణ మండపంలో అధికారులతో సమావేశం నిర్వహించగా ఆమె మాట్లాడారు.