సరస్వతీ పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

BHPL: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతీ పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.