ఆ ఘటనకు పూర్తి బాధ్యత మాదే: రంగనాథ్

ఆ ఘటనకు పూర్తి బాధ్యత మాదే: రంగనాథ్

TG: మ్యాన్‌హోల్ తెరిచిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని తెలిపారు. మ్యాన్‌హోల్ ఘటనలో పూర్తి బాధ్యత హైడ్రాదేనని, మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంఛార్జి ఆ ఘటనకు బాధ్యుడు అని స్పష్టం చేశారు. మ్యాన్‌హోల్ మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామని పేర్కొన్నారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు.