'అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తాం'

'అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తాం'

NRPT: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై రమేష్ అన్నారు. శుక్రవారం మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్లోనిభావి గ్రామం వద్ద అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఇసుక రవాణా చేస్తున్న కృష్ణప్ప, మల్లప్ప, కేశవులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.