సర్పంచ్ అభ్యర్థి విషాద మృతి
KMM: నేలకొండపల్లి మండలం అనాసాగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం అస్వస్థతకు గురైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు.