VIDEO: ముమ్మరంగా డ్రైనేజ్ నిర్మాణ పనులు
గుంటూరు చుట్టుగుంట రోడ్డు వద్ద డ్రైనేజ్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. శ్రీపోలేరమ్మ తల్లి దేవస్థానం సమీపంలో మెయిన్ రోడ్డు పగలగొట్టి, సుమారు 20 రోజుల్లో డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేస్తామని మున్సిపల్ కాంట్రాక్టర్ షేక్ అహ్మద్ తెలిపారు. చుట్టుగుంట మెయిన్ రోడ్డు నుంచి శివరాం నగర్ చివర పీకల వాగు వరకు రూ. 40 లక్షల వ్యయంతో పనులు జరుగుతున్నాయి.